Ad Code

Responsive Advertisement

గల్వాన్ వీరుడు కల్నల్ సంతోశ్ బాబుకు మహావీర చక్ర

 

 

Galwan Valley Hero Col Santosh Babu Likely To Be Awarded Mahavir Chakra On Republic Day 2021

 

Republic Day 2021: గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన కల్నల్ సంతోశ్ బాబుకు రిపబ్లిక్ డే సందర్భంగా అరుదైన గౌరవం దక్కనుంది


భారత ప్రభుత్వం ఆయనకు మరణాంతరం మహావీర చక్ర పురస్కారం ప్రదానం చేయనున్నారు.


ప్రధానాంశాలు:

  • గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన కల్నల్ సంతోశ్ బాబు.
  • అత్యున్నత యుద్ధ గ్యాలంట్రీ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
  • రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ప్రదానం
  • ల్వాన్ వీరుడు కల్నల్ సంతోశ్ బాబుకు సమున్నత గౌరవం దక్కనుంది. మంగళవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ఆయణ్ని ‘మహావీర చక్ర’ పురస్కారంతో సత్కరించనుంది. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారం మహావీర్ చక్ర. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఆయన మరణానంతరం ఎంపికయ్యారు. మంగళవారం ఉదయం రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కల్నల్ సంతోశ్ బాబు సతీమణి సంతోషిణి ఈ అవార్డును అందుకోనున్నట్లు తెలుస్తోంది.

    అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులను కేంద్ర ప్రభుత్వం ఏటా పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర పురస్కారలతో సత్కరిస్తోంది. వీటితో పాటు అశోక చక్ర, కీర్తి చక్ర, సూర్య చక్ర పురస్కారాలను శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారాలుగా అందజేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో వీటిని ప్రదానం చేస్తారు.





గతేడాది జూన్ 15న రాత్రి గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోశ్ బాబు అత్యంత వీరోచితంగా పోరాడారు. చైనా సైనికులు కుట్రలు చేసి మారణాయుధాలతో దాడి చేసినా ఏమాత్రం వెన్నుచూపకుండా తన బృందాన్ని ముందుకు నడిపించారు. పిడికళ్లతోనే 40 మందికి పైగా చైనా సైనికుల్ని మట్టి కరిపించారు. ఈ క్రమంలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.






గల్వాన్ ఘర్షణ సమయంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను కల్నల్ సంతోశ్ బాబుకు మహావీర చక్ర ప్రదానం చేయాల్సిందిగా ఇండియన్ ఆర్మీ ప్రతిపాదనలు పంపింది. కల్నల్ సంతోశ్ బాబుతో పాటు సిపాయ్ ఓఝా, హవల్దార్ పళనిలకు అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను ప్రదానం చేయాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. 

 కల్నల్ సంతోశ్ బాబు స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట.
 



Reactions

Post a Comment

0 Comments